మెగా స్టార్ట్ “లూసిఫర్” లాంచింగ్ డేట్ ఖరారు..!

మోహన్ లాల్ హీరోగా నటించిన మలయాళం మూవీ “లూసిఫర్” సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని చిరంజీవి నిర్ణయించారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా లూసిఫర్ రీమేక్ ని రూపొందించాలని కోరుతూ చిరంజీవి.. మోహన్ రాజాకి దర్శకత్వ బాధ్యతలన్నీ అప్పచెప్పారు. అయితే ఈ సినిమాని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అనగా ఆగస్టు 22న లాంఛనంగా ప్రారంభించనున్నారని విశ్వసనీయ సమాచారం. త్వరలోనే లూసిఫర్ లాంచింగ్ డేట్ కి సంబంధించి మెగా కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

లూసిఫ‌ర్ ఒరిజినల్ చిత్రంలో హీరోకి చెల్లెలిగా అసురన్ ఫేమ్ మంజు వారియ‌ర్‌ అద్భుతంగా నటించారు. ఈ పాత్ర సినిమాలో చాలా కీలకమైనది కాగా.. తెలుగు రీమేక్‌లో ఆమె పాత్రను ఎవరు పోషించనున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. చిరంజీవికి చెల్లెలిగా విద్యాబాలన్ చాలా చక్కగా సరిపోతారని.. ఆమె ఒక్కరే ఈ పాత్రకు సరైన ఛాయిస్ అని దర్శకుడు భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది