చిన్ని గుర్రంతో చిల్ అవుతున్న మిస్టర్ కూల్.. వీడియో వైరల్

June 13, 2021 at 12:30 pm

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోని ఏది చేసినా ఒక సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. ఆయ‌న‌ ఖాళీ టైమ్ దొరికితే చాలు ఫ్యామిలీతో స‌ర‌దాగా గడుప‌టానికి కేటాయిస్తాడు. ఇక ఈ కరోనా కార‌ణంగా ఐపీఎల్‌ 14వ సీజన్ మ‌ధ్య‌లోనే నిలిచిపోయిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక అప్పటినుంచి ధోనీ రాంచీలోని తన ఫామ్‌హౌజ్‌లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఫామ్‌హౌస్‌లో ఉన్న మూగజీవాలతో త‌న కూతురితో క‌లిసి సరదాగా గడిపుతున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియోలో సోష‌ల్ మీడియాలో చెక్క‌ర్లు కొడుతున్నాయి. గతనెలలో చిన్న గుర్రానికి స్నానం చేయించాడు ధోనీ. అయితే ఇప్పుడు మ‌రో చిన్న గుర్రంతో స‌ర‌దాగా గ‌డిపాడు మ‌హేంద్ర‌డు. ప్ర‌స్తుతం ఆయ‌న దానితో క‌లిసి పరుగులు తీస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ధోనీ భార్య సాక్షి. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారి చెక్క‌ర్లు కొడుతోంది.ఈ వీడియోకు ప్ర‌స్తుతం లైకులు, వేలాది కామెంట్లు వ‌స్తున్నాయి. ధోనీ ఇప్పుడు ఐపీఎల్‌కు సిద్ధ‌మ‌వుతున్నాడు ప్ర‌స్తుతం.

చిన్ని గుర్రంతో చిల్ అవుతున్న మిస్టర్ కూల్.. వీడియో వైరల్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts