నాగబాబుపై నరేశ్‌ ఫైర్.. ఎందుకంటే..?

తెలుగు చిత్రసీమ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. మా అధ్యక్ష పదవి కోసం నలుగురి వర్గాలు పోటీపడుతున్నాయి. ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ ను ప్రకటించారు. ఆయనకు మద్దతుగా నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా లో ఐక్యత లేదని.. మా ప్రతిష్ట మసకబారుతోందని నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.

అయితే తాజాగా ఈ రోజు మరో వర్గానికి చెందిన నాయకుడు, ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్.. ప్రకాశ్ రాజ్‌ ప్యానల్‌ పై విమర్శల బాణాలు వదిలారు. ఆయన నటుడు నాగబాబు నిన్న చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. మా ప్రతిష్ట మసకబారిందనడం ముమ్మాటికీ తప్పన్నారు. మా అసోసియేషన్ లో రెండేళ్లు అసమర్థత ఉన్న మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. ప్రస్తుతం అందరూ విభేదాలు పక్కన పెట్టారని స్పష్టం చేశారు. మా అసోసియేషన్ పై ఆలోచించాలన్న సీనియర్ నటుడు నరేశ్.. నాగబాబు మాటలు నిబంధనలను ధిక్కరించడమేనన్నారు. కరోనా ఆపద కాలంలో మా ఎందరో కళాకారులను ఆదుకుందన్నారు.