`సర్కారు వారి పాట`పై న్యూ అప్డేట్‌..మ‌హేష్ దిగేది అప్పుడేన‌ట‌?!

June 19, 2021 at 12:46 pm

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతున్న వేళ క‌రోనా విరుచుకు ప‌డింది. దాంతో షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా ఉధృతి త‌గ్గుతుండ‌డంతో..సర్కారు వారి పాట షూట్ పై న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

దాని ప్ర‌కారం.. ఈ చిత్రం జూలై మొదటి వారం నుంచే మ‌ళ్లీ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుందట‌. మ‌హేష్ కూడా అందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ట‌. కాగా, మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

`సర్కారు వారి పాట`పై న్యూ అప్డేట్‌..మ‌హేష్ దిగేది అప్పుడేన‌ట‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts