మ‌ళ్లీ రంగంలోకి దిగిన నితిన్‌..`మాస్ట్రో` లాస్ట్ షెడ్యూల్ ప్రారంభం!

June 14, 2021 at 11:58 am

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో మాస్ట్రో ఒక‌టి. బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన అందాదున్ సినిమా రీమేక్‌గా ఇది తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషిస్తోంది. అలాగే ఈ సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరింది. అయితే చివ‌రి షెడ్యూల్ ఉంది అనంగా క‌రోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు ప‌డింది. దీంతో షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా కేసులు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలోనే నితిన్ మ‌ళ్లీ రంగంలోకి దిగారు. ఈ రోజు మాస్ట్రో లాస్ట్ షెడ్యూల్‌ హైద‌రాబాద్‌లో స్టార్ట్ అయింది. మ‌రో వారం, ప‌ది రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తి కానుంద‌ని స‌మాచారం. కాగా, మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

మ‌ళ్లీ రంగంలోకి దిగిన నితిన్‌..`మాస్ట్రో` లాస్ట్ షెడ్యూల్ ప్రారంభం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts