తాను భారత్ కు వస్తే కరోనా ఖతం అంటున్న నిత్యానంద..!

June 8, 2021 at 4:18 pm

ప్ర‌స్తుతం ఇండియాలో క‌రోనా అల్ల క‌ల్లోలం సృష్టిస్తూ భ‌యాన‌క ప‌రిస్థితుల‌ను ప‌రిచ‌యం చేస్తోంది. ఇలాంటి టైమ్ లో అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, వ్యాక్సిన్లు వేసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు కోరుతున్నాయి. ఇక దీన్ని కూడా ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు కొంద‌రు. ఎప్పుడూ ఏదో ఒక సంచల‌న వ్యాఖ్య‌లు చేస్తూ ఉండే నిత్యానంద ఇప్పుడు మ‌రోసారి అలాంటి కామెంట్లే చేశారు.

ఇండియాలో క‌రోనా ఎప్పుడు అంత‌మవుతుంద‌ని రెండ్రోజుల ముందు ఆయ‌న్ను ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నించ‌గా.. దానికి ఆయ‌న సమాధానమిస్తూ అమ్మ ఇప్పుడు ఆధ్మాత్మిక శరీరంలోకి ప్రవేశించింద‌న్నారు. ఇప్పుడు తాను ఒక్కసారి భార‌త‌దేశ నేలపై అడుగుపెడితేనే క‌రోనా క‌ట్ట‌డ‌వుతుంద‌న్నారు. అయితే ప్ర‌స్తుతం నిత్యానంద హైపోథెటికల్ ల్యాండ్ కైలాశలో ఉంటూ అక్క‌డే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఆయ‌న కైలాసం అనే పేరు కూడా పెట‌ట్డం విశేషం. ఇక ఆ ప్రదేశానికి ఇండియన్లను ఎవరినీ రాకూడదంటూ నిత్యానంద ఆదేశాలు ఇచ్చారు. అలాగే బ్రెజిల్, యూరోపియన్ దేశాలు, అలాగే మలేసియా నుంచి కూడా ప్ర‌జ‌ల‌ను రానివ్వ‌కుండా చూస్తున్నారు. ప్ర‌స్తుతం అక్క‌డి కైలాసవాసులు, వలంటీర్లు హోం క్వారంటైన్ లో ఉంటున్నారు.

తాను భారత్ కు వస్తే కరోనా ఖతం అంటున్న నిత్యానంద..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts