కొర‌టాల శివ బ‌ర్త్‌డే..వైర‌ల్‌గా ఎన్టీఆర్ ట్వీట్‌!

June 15, 2021 at 11:24 am

మిర్చి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన కొర‌టాల శివ‌..మొద‌టి చిత్రంతోనే సూప‌ర్ హిట్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భ‌ర‌త్ అను నేను ఇలా వ‌రుస హిట్ల‌తో.. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.

కమర్షియల్‌ అంశాలకు సందేశాన్ని జోడించి సినిమాలు తీయ‌డంలో మ‌హా దిట్ట అయిన కొర‌టాల బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌కు విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసి కొర‌టాల‌కు స్పెష‌ల్‌గా విషెస్ తెలిపారు.

దీంతో ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. కాగా, ప్ర‌స్తుతం చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న కొర‌టాల శివ‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఎన్టీఆర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

కొర‌టాల శివ బ‌ర్త్‌డే..వైర‌ల్‌గా ఎన్టీఆర్ ట్వీట్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts