అందుకోసం రెండు రోజులు స్నానం లేదు : ప‌రిణీతి చోప్రా

June 9, 2021 at 1:04 pm

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఓ సన్నివేశం కోసం రెండు రోజుల పాటు స్నానం చేయకుండా అలానే ఉంటూ ఆ సన్నివేశాన్ని పూర్తి చేసినట్లు తెలిపింది. పరిణీతి చోప్రా, అర్జున్ కపూర్ నటించిన సందీప్ ఔర్ పింకీ ప‌రార్ సినిమా ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఇందులో పరిణీతి నటనకు ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. కాగా, ఇందులో ఓ సీన్ కోసం తాను రెండు రోజులు స్నానం చేయ‌లేద‌ని పరిణీతి చెప్పింది.

ఈ సినిమాలో అనుకోని ఘ‌ట‌న‌లో ఆమె పాత్రకి గ‌ర్భ విచ్ఛిత్తి జ‌ర‌గ‌డం, కొన్ని రోజుల పాటు అదే షాక్‌లో ఉండిపోవాల్సి ఉంది. ఈ సీన్లను స‌హ‌జంగా తెర‌కెక్కించ‌గా ఇందుకోసమే పరిణీతి మురికిగా ఉన్న ప్ర‌దేశంలో ప‌డుకుని రెండు రోజుల పాటు స్నానం చేయకుండా అలాగే మ‌రుస‌టి రోజు సెట్‌కు వచ్చేసి ఆ సీన్స్ లో నటించిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలకు పలువురు ప్రశంసిస్తుంటే ఇంకొందరు అదేం పద్దతి అంటూ కామెంట్ చేస్తున్నారు.

అందుకోసం రెండు రోజులు స్నానం లేదు : ప‌రిణీతి చోప్రా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts