అలా న‌టించాలంటే సిగ్గు..ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

June 17, 2021 at 7:54 am

రాజ‌కీయాల కార‌ణంగా సినిమాల‌కు దూరంగా ఉన్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ ఇటీవ‌లె వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, బండ్ల గ‌ణేష్ నిర్మాణంలో ఓ చిత్రం చేస్తూ ప‌వ‌న్ బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు.

ఇదిలా ఉంటే.. ప‌వ‌న్‌కు సంబంధించి ఓ త్రో బ్యాక్‌ వీడియో ఒక‌టి ఇప్పుడు ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప‌వ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు అవుడ్ డోర్‌ షూటన్నా, జనాల మధ్య డాన్స్‌ చేయాలన్నా సిగ్గు, మోహమాటం. ఓ సారి తన కెరీర్‌ స్టార్టింగ్‌లో సుస్వాగతం సినిమా కోసం రోడ్డు మీద నిలబెట్టి డ్యాన్స్‌ చేయమన్నారు.

అప్పుడు నావల్ల కాదు నాకు పారిపోవాలనిపించింది.. రోడ్డు మీద డ్యాన్స్‌ చేయాలంటే ఎబ్బెట్టుగా కూడా ఉండేది. అప్పుడే సినిమాల్లో నుంచి తప్పుకోవాలనుకున్నా అంటూ ప‌వ‌న్ చెప్పుకొచ్చాడు. అవుడ్ డోర్‌ షూటన్నా, జనాల మధ్య డాన్స్‌ చేయాలన్నా సిగ్గ‌న్న ప‌వ‌న్‌.. ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ అయ్యి ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకున్నాడో తెలిసిందే.

అలా న‌టించాలంటే సిగ్గు..ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts