బిగ్ బాస్‌5 లో పాయ‌ల్‌..క్లారిటీ ఇచ్చేసిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ!

June 11, 2021 at 10:34 am

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన పాయ‌ల్ రాజ్‌పూత్‌.. మొద‌టి సినిమాలోనే ఓ రేంజ్‌లో అందాలు ఆర‌బోసి యూత్‌ను ఆక‌ట్టుకుంది. ఇక ఆ త‌ర్వాత ఆర్డీఎక్స్ లవ్, వెంకీమామ, దిస్కో రాజా ఇలా ప‌లు చిత్రాల్లో న‌టించింది. అలాగే కొన్ని స్పెష‌ల్ సాంగ్స్‌లో కూడా మెరిసింది.

ఇదిలా ఉంటే.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ .. సీజన్ 5 కోసం పాయల్ ను తీసుకున్నారనే వార్త గ‌త కొద్ది రోజులుగా నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఈ సీజన్ లో చేయడానికి పాయల్ కూడా ఓకే చెప్పేసిందని ప్రచారం జోరుగా జరుగుతోంది.

అయితే ఈ విష‌యంపై పాయ‌ల్ క్లారిటీ ఇచ్చింది. తాను బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడం లేదని.. తాను బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో ఎంట్రీ ఇవ్వడం అనేది ఫేక్‌ న్యూస్‌ అని తేల్చి చెప్పింది. ఇలాంటి వార్తల్లోకి తనను లాగొద్దని కోరుతూ ట్వీట్‌ చేసింది. కాగా, గతేడాది వచ్చిన బిగ్‌బాస్‌4లో ఆమె ఒక ప్రత్యేక గీతానికి డ్యాన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

బిగ్ బాస్‌5 లో పాయ‌ల్‌..క్లారిటీ ఇచ్చేసిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts