ఆక‌ట్టుకుంటున్న ‘పీనట్ డైమండ్’ ట్రైల‌ర్‌..!

June 14, 2021 at 5:29 pm

ఇండ‌స్ట్రీలో కొత్త సినిమాల హ‌వా బాగానే న‌డుస్తోంది. తాజాగా అభినవ్ సర్ధార్ పటేల్ తోపాటు రామ్ కార్తిక్, చాందిని తమిళరసన్ అలాగే శాని సాల్మాన్ తో పాటుగా శెర్రి అగర్వాల్ కీల‌క పాత్రలతో నటించిన‌సైన్స్ ఫిక్షన్ మూవీ పీనట్ డైమండ్. ఈ మూవీకి త్రిపర్ణ వెంకటేష్ డైరెక్ష‌న్ వహించారు. అయితే రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ క్రిష్ విడుద‌ల చేశారు.

అయితే ఈ మూవీ ట్రైల‌ర్ బాగానే ఆక‌ట్టుకుంటోంది. త్రేతాయుగంలో మంచి చెడు అనేవి అంటూ మొద‌లైన డైలాగు బాగానే ఆక‌ట్టుకుంది. కాగా ఇప్పుడున్న కలియుగంలో కేవ‌లం మంచికి చోటు లేద‌ని చెడుకి బ‌లంగా పేరుంద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే 30 ఏళ్ల గ్యాప్ లో రెండు వేర్వేరు కాలాలకు చెందిన మ‌నుషుల కథలను సేమ్ వేరియేష‌న్స్‌తో చూపించేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి న‌టీన‌టులు బాగానే యాక్ట్ చేశారు. వజ్రాలపై పరిశోధన చేస్తుండ‌టంపై సినిమా సాగ‌నుంది.

ఆక‌ట్టుకుంటున్న ‘పీనట్ డైమండ్’ ట్రైల‌ర్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts