‘పుష్ప’ టైటిల్ చేంజ్ అవుతుందా..?

ఒక సినిమా విష‌యంలో ఎన్నో ర‌కాల సెంటిమెంట్ల‌ను హీరోలు ఫాలో అవుతుంటారు. ఇక అల్లు అర్జున్ త‌న సినిమా విష‌యంలో కూడా ఇలాంటి సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారంట‌. ఆయ‌న న‌టిస్తున్న పుష్ప మూవీ విషయంలో ఏకంగా డెస్టినేషనే మార్చేసిన విష‌యం తెలిసిందే. కాగా ఈ మూవీని రెండు రెండు భాగాలు తీస్తున్న‌సుకుమార్ రెండు టైటిల్స్ తో తీస్తున్న‌ట్టు తెలుస్తోంది.

సెకండ్ పార్ట్ కు కొత్త టైటిల్ ను పెట్టాల‌ని చూస్తున్నాడంట సుకుమార్. ఇక రెండో విషయం ఏంటంటే విలన్ సెలక్షన్ కు పెద్ద‌పీట వేస్తున్నారంట‌. ఇందులో దాదాపు ఎనిమిది మంది విలన్లు ఉంటార‌ని తెలుస్తోంది. ఫహద్ ఫాసిల్ ను మెయిన్ విలన్ గా చూపిస్తున్న సుకుమార్ ఫస్ట్ పార్ట్ లోనే ఫహద్ క్యారెక్టర్ ను క్లోజ్ చేస్తార‌ని తెలుస్తోంది. ఇక సెకండ్ పార్ట్ లో మోస్ట్ పవర్ ఫుల్ విలన్ అవసరం ఉంటుందని, కాబ‌ట్టి అందుకోసం మంచి నటుడిని వెతికే పనిలో ప‌డ్డాడంట డైరెక్ట‌ర్‌.