ఆర్ నారాయణమూర్తి అరెస్ట్‌..ఏం జ‌రిగిందంటే?

June 28, 2021 at 1:00 pm

ప్రముఖ సినీ నటుడు, దర్శ‌క నిర్మాత‌ ఆర్‌.నారాయణమూర్తి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ పోలీసులు ఈయ‌న‌ను అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ ఆందోళనలో భాగంగా ఏఐకేఎస్‌సీసీ, ఎస్‌ఎఎంల పిలుపుమేరకు హైదరాబాద్‌ లో ఛలో రాజ్ భవన్ కార్యక్రమం జరిగింది. ఆ ర్యాలీలో ఆర్‌ నారాయణ మూర్తి పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు శాపాలుగా మారాయని, తక్షణమే వాటిని రద్దు చేయాల్సిందేనని ఆయ‌న డిమాండ్ చేశారు.

అయితే మ‌రోవైపు రాజ్ భవన్‌ కు వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకుని అంద‌రినీ తిరిగి వెళ్లి పోమనగా.. వారు నిరాకరించారు. ఈ క్ర‌మంలోనే రైతు సంఘాలనేతలు, పోలీసులకు మధ్య వాగ్వివాదం తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అయిన వారిలో నారాయణ మూర్తి కూడా ఉన్నారు.

ఆర్ నారాయణమూర్తి అరెస్ట్‌..ఏం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts