కెరీర్‌లోనే తొలిసారి అలాంటి పాత్ర చేస్తున్న రామ్‌?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామితో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.

రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీదకు వెళ్ల‌నుంది. అయితే ఈ సినిమాలో రామ్ పాత్ర‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. దాని ప్ర‌కారం.. ఈ చిత్రంలో రామ్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌.

మరి రామ్ ఇంతవరకు ఏ చిత్రంలోనూ పోలీస్ గా కనిపించలేదు. మ‌రి తాజాగా వ‌స్తున్న వార్త‌లు నిజ‌మైతే.. రామ్ త‌న కెరీర్‌లో తొలిసారి పోలీస్ పాత్ర చేస్తున్న సినిమా ఇదే అవువ‌తుంది. ఇక రామ్ పోలీస్ అనేసరికి ఫ్యాన్స్ లో ఈ సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ అవుతోంది.