ప్ర‌భాస్ బ‌డా ప్రాజెక్ట్‌లో ఆ టాలీవుడ్ భామ‌కు అదిరే ఆఫ‌ర్‌!?

June 11, 2021 at 1:10 pm

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న బ‌డా ప్రాజెక్ట్స్‌లో నాగ్ అశ్విన్ చిత్రం ఒక‌టి. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయాంతీ మూవీస్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించ‌నున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కీల‌క‌ పాత్ర పోషించ‌నున్నాడు.

సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది. దాని ప్ర‌కారం.. ఈ చిత్రంలో ప్ర‌ముఖ టాలీవుడ్ హీరోయిన్ రాశీఖ‌న్నా కూడా క‌నిపించ‌నుంద‌ట‌.

Rashi Khanna Wiki, Age, Boyfriend, Husband, Family, Biography & More -  TheWikiFeed

ఈ సినిమాలో ఓ ముఖ్య‌మైన పాత్ర కోసం మేక‌ర్స్ ఇటీవ‌ల రాశీని సంప్ర‌దించ‌గా.. ఆమె వెంట‌నే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ని టాక్‌. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.

ప్ర‌భాస్ బ‌డా ప్రాజెక్ట్‌లో ఆ టాలీవుడ్ భామ‌కు అదిరే ఆఫ‌ర్‌!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts