సైకో కిల్ల‌ర్‌గా రాశీఖన్నా..పంజాబీ భామ ప్ర‌యోగం ఫ‌లిస్తుందా?

June 11, 2021 at 10:57 am

పంజాబీ భామ రాశీ ఖ‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌నం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌..ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ.. స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది.

ఇక తెలుగుతో పాటు త‌మిళంలోనూ వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ఈ భామ‌..డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ మీద సత్తా చాటేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తోంది. ప్ర‌స్తుతం ఈమె చేతుల్లో రెండు వెబ్ సిరీస్ ఉన్నాయి. వాటిలో రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్ అనే వెబ్‌ సిరీస్‌ ఒక‌టి. అజయ్ దేవ్‌గణ్ హీరోగా ఎమ్. రాజేష్ అనే ద‌ర్శ‌కుడు ఈ సిరీస్‌ను తెర‌కెక్కిస్తున్నారు.

ఇంగ్లిష్‌ సైకలాజికల్‌ క్రైమ్‌ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌లో రాశీఖన్నా సైకో కిల్ల‌ర్ పాత్ర‌లో కనిపించనుందట. విపరీత మనస్తత్వం కలిగిన యువతిగా ఆమె పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుందని తెలుస్తోంది. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్న‌డూ చేయ‌ని డిఫ‌రెంట్ రోల్‌ను ఎంచుకుని ప్ర‌యోగానికి సిద్ధ‌మైన రాశీ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

సైకో కిల్ల‌ర్‌గా రాశీఖన్నా..పంజాబీ భామ ప్ర‌యోగం ఫ‌లిస్తుందా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts