ప్ర‌భుత్వ అధికారిగా ర‌వితేజ..?

June 15, 2021 at 4:47 pm

ర‌వితేజ అంటేనే మాస్ ఎంట‌ర్ టైన్ మెంట్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉంటాడు. ఇక ఈ హీరో ఈ ఏడాది క్రాక్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ కేక పుట్టించాడు. ఈ సినిమాలో ర‌వితేజ ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా దుమ్ములేపాడు. దీంతో ఈ జోష్‌తో ఇప్పుడు ఖిలాడీ సినిమాతో బిజీగా ఉంటూనే కొత్త డైరెక్ట‌ర్ అయిన శ‌ర‌త్ మండ‌వ‌తో మ‌రో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు మ‌న మాస్ రాజా. ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర అప్ డేట్ ఒక‌టి ఇప్ప‌డు ఫిలింన‌గ‌ర్ లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమాలో ర‌వితేజ ప్ర‌భుత్వ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ర‌వితేజ‌ను ఇప్ప‌టి దాకా ఎక్కువ‌గా పోలీస్ ఆఫీస‌ర్ కేరెక్ట‌ర్‌తోనే మ‌నం చూశాం. కానీ ఈ సారి రూట్ చేంజ్ చేసి నిజాయితీ గ‌ల ప్ర‌భుత్వ అధికారిగా ర‌వితేజ మెస్మ‌రైజ్ చేస్తాడ‌ని టాలీవుడ్ వ‌ర్గాల గాసిప్‌. ఇక ఈ సినిమాకు ర‌వితేజ రూ. 15 కోట్లు దాకా రెమ్యున‌రేష‌న్ తీస‌కుంటున్నాడంట‌. సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో మ‌జిలీ ఫేం దివ్యాంక కౌశిక్ ర‌వితేజ‌కు జోడీగా న‌టిస్తోంది.

ప్ర‌భుత్వ అధికారిగా ర‌వితేజ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts