గెట్ రెడీ..రిలీజ్‌కు రెడీ అవుతున్న నాని `టక్ జగదీష్‌`?!

June 15, 2021 at 11:09 am

న్యాచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం ట‌క్ జ‌గ‌దీష్‌. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టించారు.

వాస్త‌వానికి ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా ఆగిపోయింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా ఉధృతి త‌గ్గుతోంది. త్వ‌ర‌లోనే థియేట‌ర్లు కూడా ఓపెన్ కానున్నాయి.

ఈ నేప‌థ్యంలో ట‌క్ జ‌గ‌దీస్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రాన్ని వచ్చే జూలై నెలాఖరున విడుదల చెయ్యనున్నార‌ట‌. ఇందుకోసం ప్ర‌స్తుతం మేక‌ర్స్ స‌న్నాహాలు షురూ చేశార‌ని.. త్వ‌ర‌లోనే దీనిపై ప్ర‌క‌ట‌న కూడా రానుందని ప్ర‌చారం జ‌రుగుతోంది.

గెట్ రెడీ..రిలీజ్‌కు రెడీ అవుతున్న నాని `టక్ జగదీష్‌`?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts