ప‌వ‌న్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆస్తుల విలువెంతో తెలుసా?

June 16, 2021 at 8:03 am

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, ఒక‌ప్ప‌టి న‌టి రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప‌వ‌న్‌తో విడిపోయిన త‌ర్వాత తన ఇద్దరు పిల్లలు ఆద్య, అకీరాలతో పూణేలో ఉంటోంది. ఇక ఇటీవ‌లె హైద‌రాబాద్‌లో సెటిల్ అయిన రేణు.. సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్‌, టీవీ షోల‌తో బిజీగా గ‌డుపుతోంది.

ఇదిలా ఉంటే పవన్ నుంచి విడిపోయే సమయంలో రేణుకు భరణం కింద భారీ మొత్తం ఇచ్చాడనే ప్రచారం గ‌తంలో చాలా సార్లు జ‌రిగింది. ఈ విష‌యంపై రేణు మీడియా ముఖంగానే పవన్ తనకు ఏం ఇవ్వలేదని..కానీ, పిల్లల కోసం మాత్రం తండ్రిగా చేయాల్సింది చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. అయితే ప‌వ‌న్ నుంచి ఏమి పుచ్చుకోక‌పోయినా.. రేణు సొంతంగా బాగానే ఆస్తులు సంపాదించింద‌ట‌.

ఆమెకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఖ‌రీదైన‌ ఇల్లు ఉంది. మూడు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయ‌ని టాక్‌. అలాగే పూణేలోనూ కొన్ని స్థిరాస్తులు ఉన్నాయ‌ట‌. ఈ మొత్తం ఆస్తుల విలువ దాదాపుగా 40 కోట్ల వ‌ర‌కు ఉంటుంది ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప‌వ‌న్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts