రియా చక్రవర్తికి బంప‌ర్ ఆఫ‌ర్‌..ద్రౌపదిగా మెర‌వ‌నున్న బ్యూటీ?!

June 11, 2021 at 11:50 am

బాలీవుడ్ న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మరణం తర్వాత రియా పేరు హాట్ టాపిక్ గా మారింది. అదే స‌మ‌యంలో డ్రగ్స్ కేసులో కూడా ఇరుక్కున్న రియా కొన్ని రోజులు పాటు పోలీసుల అదుపులో ఉంది.

దీంతో ఆమె కెరీర్ ముగిసింద‌ని అంద‌రూ భావించారు. కానీ, రియా మ‌ళ్లీ సినీ రంగంలోకి బిజీ కావ‌డానికి తీవ్ర ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈమెకు బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.పురాణ ఇతిహాస గాథ మహాభారతం స్ఫూర్తితో ఈతరం పరిస్థితులకు తగ్గట్టు, ప్రస్తుత సమాజాన్ని ప్రతిబింబించేలా హిందీలో ఓ సినిమా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

అయితే ఈ చిత్రంలో ఆధునిక ద్రౌపది పాత్ర కోసం రియా చ‌క్ర‌వ‌ర్తిని సంప్ర‌దించార‌ట‌. ఇక ఆ పాత్ర చేయ‌డానికి రియా కూడా ఆస‌క్తి చూపుతుంద‌ని టాక్ న‌డుస్తోంది. ఇక ప్రస్తుతానికైతే ఈ సినిమా ఇంకా ప్రారంభ దశలోనే ఉందని.. త్వ‌ర‌లోనే అన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు రానున్నాయ‌ని స‌మాచారం.

రియా చక్రవర్తికి బంప‌ర్ ఆఫ‌ర్‌..ద్రౌపదిగా మెర‌వ‌నున్న బ్యూటీ?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts