ఆర్ఆర్ఆర్ చివ‌రి ఘ‌ట్టానికి ముహూర్తం ఖరారు ..!

June 15, 2021 at 3:55 pm

దేశ వ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్‌. ఎందుకంటే బాహుబ‌లితో సెన్సేష‌న్ హిస్ట‌రీ క్రియేట్ చేసిన ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తీస్తుండటంతో ఆర్ఆర్ఆర్ పై అంచ‌నాలు పెరిగాయి. అలాగే ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో చేస్తుండ‌టంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఈ మూవీ క‌రోనా వ‌ల్ల‌ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. కాగా ఈ సినిమాను ఎలాగ‌యినా ఈ ఏడాదిలోనే విడుద‌ల చేయ‌నున్నారు రాజ‌మౌళి.

ఇక సినిమా షూటింగ్‌కి సంబంధించి చివ‌రి షెడ్యూల్ మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ షెడ్యూల్ లో కీలకమైన రెండు సాంగ్స్‌తో పాటు ముఖ్యమైన భారీ యాక్షన్ సీన్స్ షూటింగ్ చేయ‌నున్నార‌రు. దాదాపుగా 8 లేదా 10 వారాల్లో మూవీ షెడ్యూల్ ను కంటిన్యూగా చేసి సినిమాను పూర్తి చేయాల‌ని జక్కన్న ఆలోచిస్తున్నాడు. అయితే ఈ మూవీ షూటింగ్ జులై మొదటి వారంలోనే మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల రైట‌ర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ మూవీలోని ఓ ఫైట్ ఖచ్చితంగా కంటతడి పెట్టిస్తుంది చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఆర్ఆర్ఆర్ చివ‌రి ఘ‌ట్టానికి ముహూర్తం ఖరారు ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts