సాయిప‌ల్ల‌విని వెంట పడుతున్న హిందీ బ్యాన‌ర్లు..?

June 16, 2021 at 4:46 pm

దక్షిణాది బాషలైన తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో వరుస సినిమాలు చేస్తూ మెయిన్ హీరోయిన్ గా కొన‌సాగుతున్న వారిలో సాయిప‌ల్ల‌వి ఒకటి. కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా ఇర‌గ‌దీసే డ్యాన్సింగ్ స్టైల్ ఆవిడ సొంతం. ఈ బ్యూటీ ను హీరోయిన్ గా చేస్తున్న సినిమాకు క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది అంటే నమ్మండి. సాయి పల్లవి తెలుగులో నటించిన ల‌వ్ స్టోరీ, విరాట‌ప‌ర్వం సినిమాలు విడుద‌లకు సిద్దంగా ఉన్నాయి. అంతే కాదండోయ్.. ఈ మధ్య ఈవిడ ద‌గ్గ‌రికి బాలీవుడ్ ఆఫ‌ర్లు కూడా క్యూ కడుతున్నాయ‌న్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.

నిజానికి బాలీవుడ్ లో అనేక లీడింగ్ బ్యాన‌ర్లు ప‌ల్ల‌వితో సినిమాలు చేసేందుకు ముందుకొచ్చాయ‌ని టాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. మొత్తానికి ఇప్పుడు ఈ టాప్ హీరోయిన్ ఇక హిందీలో కూడా త‌న స‌త్తా చాటేందుకు రెడీ అవుతుంద‌నడానికి తాజాగా తెర‌పైకి వ‌స్తున్న వార్త‌లు ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. అంతేకాదు మ‌రోవైపు టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని తో శ్యామ్ సింగ‌రాయ్ సినిమాలో సాయిప‌ల్ల‌వి నటిస్తోంది.

సాయిప‌ల్ల‌విని వెంట పడుతున్న హిందీ బ్యాన‌ర్లు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts