ప‌వ‌న్‌తో మ‌రోసారి జ‌త‌క‌ట్ట‌బోతున్న స‌మంత‌..ఏ సినిమాలో అంటే?

June 11, 2021 at 8:26 am

వ‌కీల్ సాబ్ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈయ‌న చేస్తున్న ప్రాజెక్ట్‌లో హ‌రీష్ శంక‌ర్ సినిమా ఒక‌టి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్నీ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని గ‌త ఏడాడే ప్ర‌క‌టించినా.. ఇందులో ప‌వ‌న్‌కు జోడీగా న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం వెల్ల‌డించ‌లేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో అక్కినేని వారి కోడ‌లు స‌మంత న‌టించ‌బోతోంద‌ట‌.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా పాత్ర‌కు మంచి ప్రాధాన్య‌త ఉంటుంద‌ట‌. దాంతో మేక‌ర్స్ స‌మంత‌ను సంప్ర‌దించ‌గా.. ఆమె గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో చూడాలి. కాగా, గ‌తంలో అత్తారింటికి దారేది చిత్రంలో ప‌వ‌న్‌, స‌మంత జంట‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

ప‌వ‌న్‌తో మ‌రోసారి జ‌త‌క‌ట్ట‌బోతున్న స‌మంత‌..ఏ సినిమాలో అంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts