ఆ హీరోయిన్‌ను కాపీ కొట్ట‌డం ఇష్ట‌మంటున్న స‌మంత‌!

June 11, 2021 at 12:40 pm

టాలీవుడ్, కోలీవుడ్ భాష‌ల్లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న స‌మంత అక్కినేని ఇటీవ‌లె ఫ్యామిలీ మ్యాన్ 2 అనే హిందీ వెబ్ సిరీస్‌తో డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్‌లో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో స‌మంత‌.. ప్రేక్ష‌కులను మ‌రియు సినీ ప్ర‌ముఖుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది.

6 Times Samantha Akkineni was inspired by Deepika Padukone's style and  almost twinned with the B town star | PINKVILLA

దీంతో ప్ర‌స్తుతం బీటౌన్‌లో స‌మంత పేరు మారుమోగిపోతోంది. ఇదిలా ఉంటే..తాజాగా ఓ బాలీవుడ్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స‌మంత ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఫ్యాషన్ పరంగా, నటన ఎదుగుదల పరంగా దీపికా పదుకొనేను కాపీ కొట్టడం తనకు ఇష్టమని ఓపెన్‌గానే ఒప్పుకొంది స‌మంత‌.

6 Times Samantha Akkineni was inspired by Deepika Padukone's style and  almost twinned with the B town star | PINKVILLA

అంతేకాదు, దీపిక అసలు మానవ రూపంలో ఉన్న దేవతనా? అనే సందేహం కలిగింద‌ని.. అంత‌ అందంగా ఆమె ఉంటుంద‌ని స‌మ‌యం చెప్పుకొచ్చింది. అలాగే దీపిక తనదైన యూనిక్ స్టైలింగ్‌తో ప్రతిసారీ నా మ‌న‌సు దోచేస్తుంద‌ని స‌మంత పేర్కొంది. దీంతో ఆమె కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

ఆ హీరోయిన్‌ను కాపీ కొట్ట‌డం ఇష్ట‌మంటున్న స‌మంత‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts