బాల‌య్య సినిమాకు నో చెప్పిన సీనియ‌ర్ హీరోయిన్?

June 19, 2021 at 9:02 am

ఈ మ‌ధ్య కాలంలో సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్లే దొర‌క‌డం లేదు. భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేసినా ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఇప్పుడు బాల‌య్య‌కు కూడా ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది. ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్వ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న బాల‌య్య‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించ‌బోతున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ప్ర‌స్తుతం గోపీచంద్ బాల‌య్య‌కు జోడీని వెతికే ప‌నిలో ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే తాజాగా సీనియ‌ర్ హీరోయిన్ ట‌బును సంప్ర‌దించాడ‌ట ద‌ర్శ‌కుడు.

AndhaDhun Actress Tabu: "For Me, It Was Always Important To Focus On Work  Rather Than On How Famous I Am"

కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో తాను చేయలేనంటూ సున్నితంగా బాల‌య్య మూవీకి నో చెప్పింద‌ట ట‌బు. దాంతో గోపీచంద్ మరో హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, గ‌తంలో బాల‌య్య, ట‌బు జంట‌గా చెన్నవకేశవ రెడ్డి సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా కూడా నిలిచింది.

బాల‌య్య సినిమాకు నో చెప్పిన సీనియ‌ర్ హీరోయిన్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts