అనిల్ రావిపూడి దర్శకత్వంలో శర్వా నంద్..?

వ‌రుస విజ‌యాల‌తో దూసుక‌పోతున్న డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. వ‌రుస‌గా ప‌టాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు సినిమాల‌తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎఫ్-3 ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేస్తాడ‌న్న వార్త‌లు వ‌స్తుండ‌గా, ఇప్పుడు మ‌రో ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి హీరో శ‌ర్వానంద్ తో సినిమా చేయ‌బోతున్నాడ‌ని, ఇప్ప‌టికే క‌థ‌ను రెడీ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే, ఎప్పుడు ఈ సినిమా ఉంటుంది అనేది స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హా స‌ముద్రం సినిమా చేస్తున్నాడు. అనిల్ తో సినిమా చేయడానికి శర్వానంద్ కూడా బాగా ఇంట్రస్టింగ్ చూపుతున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం అంటే అటు కామెడీ, ఇటు సెంటిమెంటు రెండూ ఉంటాయని తెలుస్తోంది. వరుస విజయాలను అందుకుంటున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి శర్వానంద్ తో మరో హిట్టు కొట్టడానికి సిద్దపడుతున్నాడు.