సోనూసూద్ అతిపెద్ద డ్రీమ్ ఏంటో తెలుసా?

June 15, 2021 at 10:39 am

కరోనా విప్క‌త‌ర స‌మ‌యంలో దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌లు అండ‌గా నిలిచాడు న‌టుడు సోనూసూద్. కరోనా బాధితులకు, వలస కూలీలకు, ఉపాధి కోల్పోయిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు, చదువు మధ్యలో నిల్చిపోయిన విద్యార్థుల‌కు ఇలా ఎంద‌రికో త‌న వంతు సాయం చేసి రియ‌ల్ హీరో అయ్యాడీయ‌న‌.

ఇంతలా సేవలు అందిస్తున్న సోనూకు ఓ అతి పెద్ద డ్రీమ్ ఉంద‌ట‌. ఆ డ్రీమ్ ఏంటో సోనూ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రివిల్ చేశాడు. పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య ఉచిత వైద్య సదుపాయం అందించడంమే తన బిగ్ డ్రీమ్‌ అని సోనూ చెప్పుకొచ్చాడు.

ఇందుకోసం.. పాఠశాలలు, ఆసుపత్రులను నిర్మించాలి. ఇది వెంటనే సాధ్యం కాదని నాకు తెలుసు కానీ.. ఇది నా చిరకాల క‌ల‌. ఏదో ఒక రోజు నా కలను నేను ఖచ్చితంగా నెర‌వేర్చుకుంటాను అని సోనూ పేర్కొన్నారు.

సోనూసూద్ అతిపెద్ద డ్రీమ్ ఏంటో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts