సోనూసూద్ గొప్ప‌మ‌న‌సు..డ‌బ్బులు లేని యువ‌తకు…?!

June 12, 2021 at 12:32 pm

కరోనా కష్టకాలంలో ప్ర‌జ‌లకు అండ‌గా నిలుస్తూ.. రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్‌. సాయం కోరిన వారికి లేదు, కాదు అనుకుండా.. తనకు చేతనైన‌ సాయం చేస్తూ వ‌స్తున్నారీయ‌న‌.

ఎంద‌రో పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న సోనూ తాజాగా మ‌రో మ‌హ‌త్త‌ర‌ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టి.. గొప్ప‌ మ‌న‌సుకు చాటుకున్నాడు. ఐఏఎస్ ఆఫీస‌ర్స్ కావాల‌నుకుని, కోచింగ్ తీసుకోవ‌డానికి డ‌బ్బులు లేని యువ‌తకు సోనూసూద్ అండ‌గా నిలిచేందుకు సోనూ రెడీ అయ్యారు.

అందులో భాగంగా సంభ‌వం అనే ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఐఏఎస్ చ‌ద‌వాల‌ని అనుకునేవారు సూద్ ఛారిటీ ఫౌండేష‌న్ ఓఆర్‌జీ ద్వారా జూన్ 30లోపు వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవాల‌ని సూచించారు.

సోనూసూద్ గొప్ప‌మ‌న‌సు..డ‌బ్బులు లేని యువ‌తకు…?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts