బ‌ల‌య్య బ‌ర్త్‌డే.. అదిరిన‌ అఖండ స్పెష‌ల్ పోస్ట‌ర్‌!

June 9, 2021 at 5:19 pm

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో నంద‌మూరి బాల‌కృష్ణ ముచ్చ‌ట‌గా మూడోసారి చేస్తున్న తాజా చిత్రం అఖండ‌. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్, జ‌గ‌ప‌తిబాబు, పూర్ణ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌సరాకు విడుద‌ల‌య్యే అవ‌కావం ఉంది.

ఇదిలా ఉంటే.. రేపు(జూన్ 10) బాల‌య్య బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి అభిమానుల‌కు ముందుగానే ట్రీట్ ఇచ్చింది అఖండ టీమ్‌. తాజాగా అఖండ నుంచి బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్‌.

ఈ న్యూ పోస్టర్ లో బాల‌య్య నవ్వుతూ సూప‌ర్ స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తున్నాడు. ఇక బ్యాగ్రౌండ్‌లో ఏదో సెలబ్రేషన్స్ జ‌రుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. మొత్తానికి కలర్ ఫుల్ గా ఉన్న ఈ పోస్ట‌ర్ అదిరిపోయింద‌ని చెప్పాలి. కాగా, ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Akhanda special poster

బ‌ల‌య్య బ‌ర్త్‌డే.. అదిరిన‌ అఖండ స్పెష‌ల్ పోస్ట‌ర్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts