స్పెషల్ ట్రైనింగ్ లో నాగ్.. ?

June 15, 2021 at 3:34 pm

కింగ్ నాగార్జున‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు తో క‌లిసి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ త్వ‌ర‌లోనే సెకండ్ షెడ్యూల్ కు వెళ్ల‌నుంది. అయితే చాలా యాక్ష‌న్ ఎపిసోడ్స్ ను ఈ షెడ్యూల్ లో షూటింగ్ చేస్తారంట‌. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్టు కోసం నాగార్జున క్రావ్ మాగ‌, సమురాయ్ క‌త్తిసాము లాంటి ఇజ్రాయెలీ ఆత్మ‌ర‌క్ష‌ణ మెల‌కువ‌లు నేర్చుకుంటున్నాడని తెలుస్తోంది.

ఇక అంత‌ర్జాతీయ స్థాయిలో ఈ మూవీలో యాక్ష‌న్ సీన్స్ ఉండ‌టంతో అందుకు త‌గ్గ‌ట్టు డిఫెన్స్‌లో శిక్ష‌ణ తీసుకునే ప‌నిలో నాగార్జున ఉన్నాడు. ఇంకోవైపు బంగార్రాజు మూవీలో కూడా న‌టిస్తున్నాడు నాగార్జున ప్ర‌స్తుతం ఈ మూవీ స్కిప్ట్ రెడీ చేసే ద‌శ‌లోనే ఉంది. కాగా నాగార్జున బంగార్రాజు ప్రాజెక్టును ఎప్పుడు స్టార్ట్ చేస్తాడ‌నేది వేచి చూడాలి. ఇక ఈ ఏడాది నాగార్జున చేసిన వైల్డ్ డాగ్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చి బాగానే ఆడింద‌ని చెప్పాలి.

స్పెషల్ ట్రైనింగ్ లో నాగ్.. ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts