అప్పుడే పెళ్లి.. వైర‌ల్‌గా తాప్సీ కామెంట్స్!

June 11, 2021 at 1:24 pm

ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన తాప్సీ.. ఇక్క‌డ ప‌లు చిత్రాలు చేసిన త‌ర్వాత బాలీవుడ్‌కు మ‌కాం మార్చేసింది. అక్క‌డే వ‌రుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్న తాప్సీ.. ఎప్పుడెప్పుడు పెళ్లి పీట‌లెక్కుతుందా అని అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మాథ్యూస్‌తో తాప్సీ ప్రేమాయ‌ణం న‌డిపిస్తుంద‌ని గ‌త కొద్ది రోజులుగా వార్తలు వ‌స్తూనే. అంతేకాదు వీరిద్దరూ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నట్టు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా పెళ్లి ఎప్పుడు అన్న విష‌యాన్ని వెల్ల‌డించింది తాప్సీ.

చిత్ర పరిశ్రమకు చెందిన వారిలో ఒకరిని జీవిత భాగస్వామిగా ఎంచుకోడం నాకు ఇష్టంలేదు. రాణించే వృత్తి, వ్యక్తిగత జీవితం వేర్వేరుగా ఉండాలి. అదేసమయంలో మ్యాథ్యూస్‌ నాకు బాగా తెలిసిన వ్యక్తి. సన్నిహితుడు కూడా. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచ‌న లేదు. ప్రస్తుతం యేడాదికి ఆరు చిత్రాల్లో నటిస్తున్నాను. ఈ సంఖ్య రెండు లేదా మూడుకు తగ్గినపుడే నేను పెళ్ళి చేసుకుంటా అని తాప్సీ చెప్ప‌డంతో.. ఆమె వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి.

అప్పుడే పెళ్లి.. వైర‌ల్‌గా తాప్సీ కామెంట్స్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts