తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు..!

June 9, 2021 at 11:31 am

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో క‌రోనా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతోంది. ఇలాంటి టైమ్‌లో స్టూడెంట్ల‌కు ఇబ్బందులు రాకుండే ఉండేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే టెన్త్‌, ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ఎగ్జామ్స్‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎప్ప‌టి నుంచో ఇంట‌ర్‌సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ కూడా ర‌ద్దు చేయాల‌నే డిమాండ్ ఉంది.

ఇందుకోసం తెలంగాణ ప్ర‌భుత్వం ఇంటర్ సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ రద్దు చేసింది. ఈ రోజు ఇందుకు సంబంధించి తాజా ప్రకటన విడుదల చేసింది. ఫస్ట్‌ ఇయర్‌లో స్టూడెంట్ల‌కు వచ్చిన గ్రేడ్ మార్కుల ఆధారంగానే సెకండియర్‌లో గ్రేడింగ్‌ ఇవ్వనున్నట్టు ప్ర‌భుత్వం తెలిపింది. పదో తరగతి, ఇంటర్ మొద‌టి సంవ‌త్స‌ర ఎగ్జామ్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఏప్రిల్ లోనే ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సెకండ్ ఇయ‌ర్ స్టూడెంట్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది ప్ర‌భుత్వం. థ‌ర్డ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకునే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts