ఆ విష‌యంలో మ‌హేష్ ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చిన థ‌మ‌న్‌!

June 16, 2021 at 12:03 pm

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం స‌ర్కారు వారి పాట‌. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. అయితే ఈ మూవీ మ్యూజిక్ ఖ‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని మ‌హేష్ ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చాడు థ‌మ‌న్‌. తాజాగా `ఈ సినిమా కోసం చేసిన సాంగ్స్ మహేష్‌ అభిమానుల్లో మరింత జోష్ పెంచేలా వచ్చాయి.

అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుంది. ఈ సినిమాతో పాటు సంగీతం కూడా తప్పకుండా హిట్ అవుతుంద‌ని .. అందులో ఎలాంటి సందేహం లేదు` సోష‌ల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు థ‌మ‌న్‌.

ఆ విష‌యంలో మ‌హేష్ ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చిన థ‌మ‌న్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts