ట్విట్టర్‌ షాక్ ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు…?

ప్ర‌ముఖ సోష‌ల్‌మీడియా సంస్థ అయిన ట్విట్ట‌ర్‌కు వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి, ట్విట్టర్‌కు కొద్ది రోజులుగా వివాదం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో కొత్త ఐటీ నిబంధనలను అమలు చేయ‌డానికి ట్విట్టర్‌కు ఇప్పటివరకూ ఉన్న జవాబుదారీతనం నుంచి మినహాయింపును కోల్పోయిన‌ట్టు తెలుస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలో డిజిట‌ల్ కంటెంట్ పై నియంత్ర‌ణ విధించేందుకు కేంద్రం తీసుకువ‌చ్చిన కొత్త ఐటీ రూల్స్ మే 25 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

అయ‌తే ఇక నుంచి యూజర్ల అభ్యంతరకరమైన పోస్టులపై ట్విట్టర్ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలకు బాధ్య‌త‌లు వ‌హించాల్సి ఉంటుంద‌ని కేంద్రం తెలిపింది. ఇందులో భాగంగానే ట్విట్టర్ యాప్‌పై దేశంలో ఇప్పుడు రెండో కేసు న‌మోదైంది. హైదరాబాద్‌లో వీడియోను ప్ర‌చారం చేస్తున్నందుకు ఈ కేసును రిజిస్ట‌ర్ చేశారు. ఇందుకు గాను ట్విట్టర్ యాజమాన్యానికి నోటీసులు పంపారు సైబరాబాద్ పోలీసులు. అభ్యంత‌ర‌క‌ర‌ర కామెంట్లకు ట్విట్టర్ బాధ్యత వహించాల‌ని నోటీసులో పేర్కొన్నారు మ‌న పోలీసులు.