ఉపాసనపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్..?

June 18, 2021 at 3:35 pm

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ లలో ఒక్కటైన చిరంజీవి కుటుంబం నుంచి ఎప్పుడూ ఏదో ఒక విషయం వార్తల్లో కనిపిస్తూనే ఉంటుంది. మెగా బ్రదర్స్ లో ఒక్కడైనా నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆయన ఎక్కువగా యాక్టివ్ గా ఉండక పోయిన.. ఆయనకు రావాల్సి వచ్చినప్పుడు మాత్రం తాను మాట్లాడి ఏదో ఒక విమర్శల పాలు అవుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. అయితే ఈసారి మాత్రం మెగా బ్రదర్ నాగబాబు మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య అయిన ఉపాసన గురించి మాట్లాడటం నిజంగా ఆశ్చర్యం. తాజాగా నాగబాబు ఉపాసన గురించి మాట్లాడుతూ..

హాస్పిటల్స్ రంగంలో ఎంతో పెద్ద పేరుపొందిన అపోలో హాస్పిటల్స్ ను ఉపాసన ఎంతో జాగ్రత్తగా మేనేజ్ చేస్తుందని.. అలాగే ప్రస్తుతం ఉన్న సమయంలో కరోనా చికిత్స కోసం అతి తక్కువ ఖర్చులకు ట్రీట్మెంట్ అందించడంలో ఆవిడ ప్రముఖ పాత్ర వహించిందని తెలియజేశాడు. ఒకసారి తాను అంత తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ ఎలా సాధ్యమవుతుందని ఉపాసనను అడిగితే.. మనం ఇలాంటి సమయంలోనే కదా సహాయం చేయాల్సింది అంటూ చెప్పగా, దాంతో తనకి ఆమె గొప్పతనం అర్థం అయి చాలా ఆనందంగా ఫీల్ అయినట్లు తెలియజేశాడు. ఇలాంటి కార్యక్రమాలు ఉపాసన ఇదివరకు కూడా ఎన్నో చేసిందని.. పేరుకు తగ్గట్టుగానే మెగాస్టార్ కోడలు అనిపించుకుంటుంది అంటూ నాగబాబు ఉపాసన గురించి తెలియజేశారు.

ఉపాసనపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts