వ్యాక్సినేషన్ పై కొత్త మార్గదర్శకాలు … ?

కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం 75% వ్యాక్సిన్‌ను వ్యాక్సిన్ తయారీదారుల నుంచి కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తుంది. కొత్త మార్గదర్శకాలలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి, టీకా సరఫరా షెడ్యూల్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వంత ప్రాధాన్యతను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ ధరను తయారీ సంస్థలు మాత్రమే ప్రకటిస్తాయని ఆ మార్గదర్శకాలలో పేర్కొన్నారు. టీకాల వృథాను బట్టి రాష్ట్రాలకు వ్యాక్సిన్ కేటాయింపుల్లో కోత విధిస్తామని కేంద్రం అన్ని ఆస్పత్రులకు సమానంగా వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

ప్రైవేట్ ఆస్పత్రులకు కావాల్సిన డోసుల వివరాలను రాష్ట్రాలే ఇవ్వాలని తెలిపింది. పేదలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకా వేయించుకోవడం కోసం ఈ వోచర్లు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. ఇక కరోనా వ్యాక్సిన్ల సేకరణ వాటిని రాష్ట్రాల కు పంపిణీ చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. జూన్ 21 నుండి ప్రభుత్వ కేంద్రాల్లో ఉచిత వ్యాక్సిన్ లభిస్తుంది, కాని ప్రైవేట్ ఆసుపత్రులలో వ్యాక్సిన్ కు నగదు చెల్లించాల్సి ఉంటుంది.