వ‌రుణ్ చేతిలో రామ్ చ‌ర‌ణ్ సినిమా.. ?

June 18, 2021 at 3:11 pm

తెలుగు ఇండ‌స్ట్రీలో ఒక హీరోతో చేయాల్సిన క‌థ‌ను మ‌రో హీరోతో చేయ‌డం అనేది చాలా ప‌రిపాటిగా జ‌రుగుతుంది. ఇదే పంతాలో ఇప్పుడు డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల అన్న‌తో చేయాల్సిన క‌థ‌ను త‌మ్ముడితో చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. వెంకి కుడుముల ఇప్ప‌టి వ‌ర‌కు తీసిన సినిమాలు రెండే అయినా మంచి హిట్ కొట్టాడు ఆరెండింటితో. ఇక నాగశౌర్యతో తీసిన ఛ‌లో మూవీ బంప‌ర్ హిట్ కొట్టాడు ఆయ‌న‌. ఆ త‌ర్వాత నితిన్‌తో తీసిన భీష్మ సినిమా కూడా మంచి హిట్ సాధించింది. కాగా ఈ రెండు మూవీల్లో ర‌ష్మిక మండ‌న్న‌నే న‌టిచింది.

దాంతో ఆయ‌న రామ్‌చ‌ర‌ణ్‌తో ఓ మూవీ చేయ‌డానికి క‌థ‌లు కూడా చేప్పాడంట‌. కానీ ఆయ‌న చెప్పిన కథ‌లు చ‌ర‌ణ్ కు న‌చ్చ‌లేదంట‌. దీంతోపాటు చ‌ర‌ణ్ ఇప్పుడు భారీ సినిమాల్లో చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఆర్ ఆర్ ఆర్ లో న‌టిస్తుండ‌గా.. ఇంకోవైపు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంకర్‌తో మ‌రో సినిమా ప్లాన్ చేస్తున్నాడు చెర్రీ. అయితే ఇదే క‌థ‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు చెప్పి ఓకే చేయించాడు వెంకీ కుడుముల‌. ఇప్పుడు వ‌రుణ్ తేజ్ చేస్తున్న గ‌ని, ఎఫ్ -3 సినిమాలు అయిపోగానే ఈ ప్రాజెక్టును ప‌ట్టాలెక్కిస్తారని తెలుస్తోంది.

వ‌రుణ్ చేతిలో రామ్ చ‌ర‌ణ్ సినిమా.. ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts