ఓటిటిలో విద్యాబాలన్ సినిమా..?

June 7, 2021 at 4:00 pm

బాలీవుడ్ ఇండస్ట్రీ లో కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా వైవిధ్యమయిన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది విద్యాబాలన్. పెళ్లి తర్వాత పూర్తిగా నటనకు ఆస్కారం ఉండేటి వంటి పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది విద్య. విద్యాబాలన్ ఎప్పుడైనా సరే తనకు పాత్ర నచ్చితే చాలు ఇంకేమి చూడకుండా ఓకే చెప్పేస్తుంది. ఎక్కువగా ఎక్సపరిమెంటల్ సినిమాల పై మొగ్గు చూపుతూ , అలాగే ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది.

తాజాగా విద్యా ” షేర్ని” అనే చిత్రంలో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. అడవుల సంక్షేమం ఇంకా అడవి మృగాలకు మనుషుల జీవన విధానాలకు ఉన్న సంబంధం ఎలా ఉంటుందో అన్న అంశంపై ఈ సినిమా ఉండబోతునట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని కూడా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం షేర్ని ట్రైలర్ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొల్పింది. కరోనా తీవ్రత దృష్ట్యా విద్యాబాలన్ నటించిన షేర్ని చిత్రాన్ని జూన్ 18న అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్ అవ్వబోతునట్లు సినీ బృందం తెలిపింది. అమిత్ మసుర్కర్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో షర్మన్ జోషి మృనాల్ ఠాకూర్ లు ముఖ్య పాత్రలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఓటిటిలో విద్యాబాలన్ సినిమా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts