విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్లాప్ సినిమా కొత్త రికార్డులు!

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా, ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా కొత్త ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కించిన చిత్రం డియ‌ర్ కామ్రేడ్. 2019లో ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ చేశారు.

భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా పడింది అయితే ఇప్పుడు ఈ చిత్రం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తెలుగులో ఫ్లాపైన డియర్ కామ్రేడ్‌ హిందీలో మాత్రం ఓ రేంజ్‌లో అద‌ర‌గొట్టింది. గ‌త ఏడాది జనవరి 19న యూబ్యూబ్‌లో విడుదలైన డియర్ కామ్రేడ్ హిందీ డబ్బింగ్ వర్షన్ భారీ వ్యూస్‌తో దూసుకుపోతోంది

తాజాగా ఈ చిత్రం ఏకంగా 250 (25 కోట్లు) మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలనం రేపింది. అలాగే 2.9 లైక్స్ సంపాదించి రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. ఈ లెక్క‌లు చూస్తుంటే డియర్ కామ్రేడ్‌ చిత్రాన్ని హిందీ ప్రేక్షుకులు ఎంతగా ఆద‌రిస్తున్నారో స్ప‌ష్టంగా అర్థం అవుతోంది.