ఎన్టీఆర్ కోసం సేతుపతిని లైన్‌లో పెడుతున్న స్టార్ డైరెక్ట‌ర్‌?!

June 15, 2021 at 10:59 am

ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. ఆ త‌ర్వాత కొర‌టాల శివ‌తో ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఆ వెంట‌నే స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో త‌న 31వ చిత్రం ఉంటుంద‌ని ఎన్టీఆర్ ఇటీవ‌లె ప్ర‌క‌టించాడు.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించ‌నున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది.

దాని ప్ర‌కారం.. ఈ చిత్రంతో ఓ కీల‌క పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని లైన్‌లో పెట్టేందుకు ప్ర‌శాంత్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. సేతుప‌తి ఒకే చెబితే..మేకర్స్ నుంచి త్వరలో ఇందుకు సంబందించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుంది. అయితే ఎన్టీఆర్ సినిమాలో సేతుపతి ఏ పాత్రలో కనిపిస్తాడు అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎన్టీఆర్ కోసం సేతుపతిని లైన్‌లో పెడుతున్న స్టార్ డైరెక్ట‌ర్‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts