సాయం చేయాల‌నే ఆలోచ‌న సోనూకు ఎలా వ‌చ్చిందో తెలుసా?

క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌ష్ట‌మ‌న్న చోట క‌లియుగ క‌ర్ణుడిగా వాలిపోతున్నాడు న‌టుడు సోనూసూద్‌. లాక్‌డౌన్ సమయం నుంచి ఎంతో మందికి సేవ‌లు అందిస్తూ రియ‌ల్ హీరో అనిపించుకున్న సోనూ.. త‌న సేవా కార్యక్రమాలకు అస్సలు అంతమే లేదు అన్నట్లుగా రోజూ ఏదో ఒక కార్యక్రమంతో వార్తలలో నిలుస్తున్నారు.

అయితే అస‌లు సోనూసూద్‌కు ప్ర‌జ‌ల‌కు స‌హాయం చేయాల‌నే ఆల‌చ‌న ఎలా మొద‌లైంది? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలుసుకోవాల‌ని చాలా మందికి ఉంది. ఈ విష‌యంలోపై తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సోనూ భార్య సోనాలీ వివ‌ర‌ణ ఇచ్చింది. సోనాలీ మాట్లాడుతూ..గ‌తేడాది క‌రోనా టైమ్‌లో అంద‌రం ఇంట్లో కూర్చుని టీవీ చూస్తుండ‌గా.. వేల మంది వ‌ల‌స కూలీలు త‌మ స్వ‌స్థ‌లాల‌కు కాలి న‌డ‌క వేళ్తోన్న దృశ్యాలు క‌నిపించాయి.

వారిలో వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. వారి స్థితిలో మేము ఉంటే..? మా పిల్లలే అలా నడవాల్సి వస్తే.. ? ఇలాంటి ఆలోచనలే ఆ రోజంతా వెంటాడాయి. దాంతో వారి కోసం ఏదైన చేయాలని భావించిన సోనూ.. వ‌ల‌స కూలీల‌కు అవ‌స‌ర‌మైన ఆహారం, వెళ్ల‌డానికి ర‌వాణా సౌక‌ర్యాన్ని ఏర్పాటు చేశారు. అలా మొద‌లైన ఈ సేవ కార్య‌క్ర‌మం ఇప్పుడు ఇంత దాక వ‌చ్చింది అని సోనాలీ చెప్పుకొచ్చింది.