భర్త పై రివర్స్ కేసు పెట్టిన నటి..?

ప్రముఖ హిట్ అయిన హిందీ సిరీయల్ యే రిష్‏కా క్యా కెహ్లతా హై నటుడు కరణ్ మెహ్ర, టీవీ నటి నిషా రావల్ ప్రేమించుకుని ఆ తరువాత 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కవిష్ అనే నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కరణ్ కి యే రిష్‏కా క్యా కెహ్లతా హై సిరీయల్ ద్వారా మంచి పేరు లభించింది. కరణ్ ను సోమవారం రాత్రి ముంబై పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. అతని భార్య నిషా కరణ్ తన పై దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తరువాత కరణ్ కు మంగళవారం బెయిల్ వచ్చింది. కరణ్ వివరాల ప్రకారం వాళ్లే ప్లాన్ చేసి రివర్స్‌లో కేసు పెట్టారని చెప్తున్నాడు.

ప్లాన్ ప్రకారం ఫ్లాట్ లో కెమెరాలు ఆఫ్ చేసి తనని తన భార్య ఇంకా ఆమె సోదరుడు కొట్టారని, రివర్స్‌లో తన పై కేసు పెట్టారని కరణ్ మెహ్రా అన్నాడు. మహిళలకు ఉన్న పవర్ ను ఇలా దుర్వినియోగం చేసుకోటం చాలా బాధాకరమని అన్నాడు. తాను ఈమధ్యనే కొవిడ్ బారిన పడి తేలుకుంటున్నాని , ఎనర్జీ లేని టైములో ఇలా ఎటాక్ ఎలా చెయ్యగలనని ప్రశ్నించాడు. కరణ్ మెహ్రా పై కేసు నమోదు చేసుకున్న ముంబయ్ పోలీసులు ప్రస్తుతం కేసు అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.