శారీలో క‌ల‌ర్‌ఫుల్‌గా మెరిసిపోతున్న పూర్ణ‌..ఫొటోలు వైర‌ల్!

July 1, 2021 at 12:03 pm

పూర్ణ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన పూర్ణ‌.. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించింది. అయితే స‌రైన హిట్ ప‌డ‌క పోయినా.. టాలెంటెడ్ న‌టిగా ప్రూవ్ చేసుకుంది పూర్ణ‌.

తాజాగా పూర్ణ లేటెస్ట్ ఫోటో షూట్లతో రెచ్చిపోయింది. ఫ్లవర్స్ ప్రింటెడ్‌ శారీలో హోయలు పోయింది. పరువాల విందు వడ్డించింది.

ఇక ఇటీవ‌ల‌ రాజ్ తురుణ్ హీరోగా తెర‌కెక్కిన పవర్ ప్లే సినిమాలో నెగిటివ్ రోల్ పోషించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ భామ‌.. ప్ర‌స్తుతం బ్యాక్‌ డోర్‌, తలైవి, అఖండ వంటి చిత్రాల‌తో పాటుగా ప‌లు టీవీ షోలు కూడా చేస్తోంది.

కానీ పూర్ణకి సినిమాల కంటే టీవీనే బాగా పేరుతెచ్చినట్టుంది. ఈటీవీలో ప్రసారమయ్యే `ఢీ` షోకి జడ్జ్ గా మారిన తర్వాత క్రేజ్‌ని, పాపులారిటీని తెచ్చుకుంది. సోషల్‌ మీడియా అభిమానులకు బాగా దగ్గరయ్యింది.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే పూర్ణ‌.. తాజాగా శారీ ధ‌రించి ఫొటోల‌కు పోజులిచ్చి అందుకు సంబంధించిన పొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఈ ఫొటోల్లో పూర్ణ‌ వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ క‌ల‌ర్ ఫుల్‌గా క‌నిపిస్తోంది. నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటున్న ఈ ఫొటోలు.. నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

అయితే ఆ స్థాయిలో ఈ అమ్మడి అందాలను మరెవరూ చూపించలేకపోయారు.  అందుకే పూర్ణ గురించి చెప్పాల్సి వస్తే `అవును` సినిమా ప్రస్తావన చేయాల్సి వస్తుంది.

పూర్ణ నో డౌట్‌ సెక్సీ అందాల నటి. ఆమె అందాలను `అవును` సినిమాలో చాలా హాట్‌గా చూపించాడు దర్శకుడు రవిబాబు. ఈ అమ్మడి అందాల్లోని ఘాటెంటో ఆడియెన్స్ కి టేస్ట్ చేయించాడని చెప్పొచ్చు.

తోటి `ఢీ` జడ్జ్ ప్రియమణి కూడా ఈ రోజు శారీలో మెరిసింది. చూడబోతుంటే పూర్ణ కూడా ప్రియమణికి పోటీ ఇవ్వబోతున్నట్టు అనిపిస్తుంది. మరోవైపు కుర్రభామలు రష్మీ, దీపికా పిల్లిలకు షాక్‌ ఇవ్వబోతుందని చెప్పొచ్చు.

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనేలా పోజులిచ్చిందీ హాట్‌ అందాల భామ. ఈ లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.

 

శారీలో క‌ల‌ర్‌ఫుల్‌గా మెరిసిపోతున్న పూర్ణ‌..ఫొటోలు వైర‌ల్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts