హీరోగా దేవిశ్రీ ఎంట్రీ..నిర్మాత‌గా ప్ర‌ముఖ‌ హీరోయిన్‌?!

July 1, 2021 at 10:02 am

మ్యూజిక్ తో మెస్మరైస్ చేసి రాక్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న దేవిశ్రీ ప్ర‌సాద్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ మ్యూజికల్ హిట్స్ ను అందించిన దేవిశ్రీ‌.. త్వ‌ర‌లోనే హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

వాస్త‌వానికి గ‌తంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైనప్పటికీ, అది పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. అయితే ఇప్పుడు మ‌రోసారి దేవిశ్రీ హీరో ఎంట్రీపై వార్త‌లు వస్తున్నాయి. ఈయ‌న డ‌బ్యూ చిత్రం హర్రర్ డ్రామాగా తెర‌కెక్క‌బోతోంది.. ఈ మూవీ ద్వారా ఓ కొత్త ద‌ర్శ‌కుడు ప‌రిచయం కాబోతున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది.

అంతేకాదు, దేవిశ్రీ డ‌బ్యూ చిత్రాన్ని ప్ర‌ముఖ హీరోయిన్ ఛార్మీ కౌర్ నిర్మించ‌బోతోంద‌ని తెలుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే. కాగా, ప్ర‌స్తుతం దేవిశ్రీ‌ పుష్ప‌తో పాటు ప‌లు చిత్రాల‌కు మ్యూజిక్ అందిస్తున్నాడు.

హీరోగా దేవిశ్రీ ఎంట్రీ..నిర్మాత‌గా ప్ర‌ముఖ‌ హీరోయిన్‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts