చ‌ర‌ణ్ సాంగ్‌కు అద‌ర‌గొట్టేసిన జపాన్ జంట‌..వీడియో వైర‌ల్‌!

July 1, 2021 at 9:45 am

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వైవిధ్యమైన నటన, సూపర్‌ డ్యాన్స్‌తో దేశ‌వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడీయ‌న‌. అల‌గే జ‌పాన్‌లోనూ చ‌ర‌ణ్‌కు అభిమానులున్నారు.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ జ‌పాన్ జంట చ‌ర‌ణ్‌పై త‌మ అభిమానాన్ని తెలుపుతూ.. ఆయ‌న న‌టించిన రంగస్థలంలో జిగేలు రాణి సాంగ్‌కు స్టెప్పులేశారు. అయితే ఏదో డ్యాన్స్ వేసినట్లు కాకుండా.. తమలోని వైవిధ్యాన్ని ఈ జంట‌ బయటపెట్టారు.

పాటలో చ‌ర‌ణ్‌, పూజా హెగ్డే ధరించినట్లుగానే డ్రస్‌లు ధరించిన ఆ ఇద్దరు.. వారిలాగే స్టెప్పులు వేస్తూ అద‌ర‌గొట్టేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజ‌న్లు ఈ జ‌పాన్ జంట డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు.

చ‌ర‌ణ్ సాంగ్‌కు అద‌ర‌గొట్టేసిన జపాన్ జంట‌..వీడియో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts