వాటిని అడుక్కుంటుంది..తాప్సీపై కంగ‌నా ఘాటు వ్యాఖ్య‌లు!

July 1, 2021 at 8:43 am

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, టాలెంటెడ్ యాక్ట్రెస్ కంగ‌నా ర‌నౌత్‌.. ప్ర‌ముఖ హీరోయిన్ తాప్సీ ప‌న్ను మ‌ధ్య గ‌త కొద్ది రోజులుగా హాట్ వార్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియా వేదిక‌గా వీరిద్ద‌రూ ఒకరిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ త‌ర‌చూ వార్త‌ల‌లో నిలుస్తూ ఉన్నారు.

ఇక తాజాగా తాప్సీపై మ‌రోసారి ఘాటు వ్యాఖ్య‌లు చేసింది కంగనా. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ మ‌ధ్య కంగ‌నా ట్విట్టర్ బ్యాన్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కు పరిమితం అయింది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న తాప్సీని..ట్విట్టర్లో కంగనా లేకపోవడం లోటుగా ఉందా అని ప్ర‌శ్నించ‌గా.. అలాంటిదేమీ లేదని తేల్చేసింది.

ఇక తాప్సీ లేదు అని చెప్పిన పాపానికి.. కంగ‌నా ఆమెపై ఆవిమర్శలు గుప్పించింది. ఆమె ఒక బి గ్రేడ్ యాక్ట్రెస్ అని.. వేరే వాళ్లు వదిలేసిన పాత్రలను తనకివ్వమంటూ నిర్మాతల్ని ఆమె అడుక్కుంటూ ఉంటుందని చెల‌రేగిపోయింది. అంతేకాదు, ఆమె తనను కాపీ కొడుతూ ఉంటుందని కూడా కంగనా తాప్సీని ఎద్దేవా చేసింది. దాంతో కంగ‌నా పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

వాటిని అడుక్కుంటుంది..తాప్సీపై కంగ‌నా ఘాటు వ్యాఖ్య‌లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts