ఆ మూవీపైనే ఫుల్ ఫోక‌స్ పెట్టిన‌ కృతి శెట్టి!?

July 1, 2021 at 12:44 pm

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన కృతి శెట్టి.. మొద‌టి చిత్రంతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకోవ‌డంతో పాటుగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైపోయింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు నాని స‌ర‌స‌న శ్యామ్ సింగ‌రాయ్‌, సుధీర్‌బాబు స‌ర‌స‌న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తోంది.

అయితే ప్ర‌స్తుతం క‌రోనా అదుపులోకి వ‌స్తుండ‌డంతో.. ఒక్కో సినిమా సెట్స్ మీద‌కు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబోలో తెర‌కెక్కుతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రం కూడా సెట్స్ మీద‌కు వెళ్లింది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి | Aa Ammayi Gurinchi Meeku Cheppali

ఈ సినిమా షూటింగ్‌లో కృతి శెట్టి నేటి నుంచి జాయిన్ అయింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. కృతి తన ఫుల్ ఫోక‌స్‌ను ఈ సినిమా మీదే పెట్టాలనుకుంటుంద‌ట‌. ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంట‌నే రామ్‌, లింగుస్వామి కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రంలో కృతి పాల్గోనుంద‌ట‌.

ఆ మూవీపైనే ఫుల్ ఫోక‌స్ పెట్టిన‌ కృతి శెట్టి!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts