సామాన్యుడిపై మ‌రో పిడుగు..భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర!

July 1, 2021 at 11:08 am

ఓవైపు రోజు రోజుకు ప‌రుగులు తీస్తున్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌తో బెంబేలెత్తిపోతున్న సామాన్యుడి నెత్తిపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మ‌రో పిడుగు వేశాయి. ప్రతీ నెల ఒక‌టోవ‌ తేదీన గ్యాస్ సిలిండర్ల ధరల్ని ఆయిల్ కంపెనీలు సవరిస్తాయన్న సంగతి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలోనే గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. దేశీయంగా సబ్సిడీయేతర ఎల్‌పీజీ సిలిండర్ల ధరను ఏకంగా రూ. 25 పెంచాయి. కమర్షియల్ సిలిండర్ ధరను 84 రూపాయలు పెంచుతున్నట్లు తెలియజేశాయి. దీంతో 14.2 కిలోల దేశీయ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో 834.50 రూపాయల‌కు చేరుకుంది.

అలాగే ముంబైలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 834.50కి, కోల్‌కతాలో రూ. 861కి, చెన్నైలో రూ. 850.50కి మ‌రియు హైదరాబాద్‌లో రూ.887కి చేరుకుంది. ఇక సవరించిన రేటు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

సామాన్యుడిపై మ‌రో పిడుగు..భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts