రూటు మార్చిన రాజ‌మౌళి..మ‌హేష్‌తో సూప‌ర్ ప్లాన్‌?!

July 1, 2021 at 7:58 am

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాంబోలో త్వ‌ర‌లోనే ఈ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంపై ఇప్ప‌టికే రాజ‌మౌళి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చాడు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ క‌థ అందిస్తున్నారు.

అయితే ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచీ.. మ‌హేష్‌తో జ‌క్క‌న్న చేయబోయే సినిమా ఎలా ఉంటుంది? ఏ జోన‌ర్‌లో ఉండ‌బోతోంది? అనే ప్ర‌శ్న‌లు అభిమానుల‌తో పాటు సినీ ప్రియుల్లోనూ మొద‌ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలోనే రాజ‌మౌళి మ‌హేష్‌తో చేయ‌బోయే సినిమాపై ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ద‌ర్శ‌క‌ధీరుడు ప్ర‌స్తుతం చేస్తున్న‌ ఆర్ఆర్ఆర్ సినిమా పీరియాడిక్ ఫిల్మ్. గతంలో చేసిన బాహుబలి జానపదం జానర్లో తెరకెక్కించాడు. అందుకే ఈ సారి రాజ‌మౌళి రూటు మార్చి.. మ‌హేష్‌తో సామాజిక అంశాల పై కమర్షియల్ ఫిల్మ్ రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. అందుకు మ‌హేష్ కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ పూర్తి అయిన వెంట‌నే.. వీరి కాంబో చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుందని టాక్‌.

రూటు మార్చిన రాజ‌మౌళి..మ‌హేష్‌తో సూప‌ర్ ప్లాన్‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts