కొత్త కారు కొన్న ప‌వ‌న్‌..ఎన్ని కోట్లో తెలుసా?!

July 1, 2021 at 9:27 am

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మాణంలో వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇక ప్ర‌స్తుతం ప‌వ‌న్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చిత్రాలు చేస్తున్నాడు.

వీటి త‌ర్వాత హారిష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్న ప‌వ‌న్‌.. మ‌రో రెండు చిత్రాల‌ను లైన్‌లో పెట్టాడు. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ టాప్ హీరో అయిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ ఎంతో సింపుల్‌గా ఉంటాడు. అయితే గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా పాత కారులోనే ప్ర‌యాణిస్తున్న ప‌వ‌న్.. తాజాగా ఓ కొత్త కారును బుక్ చేసినట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

అతి తక్కువ మంది సెలబ్రిటీలు మాత్ర‌మే వాడే రేంజ్ రోవర్ 3.0 ఎస్‌వి ఆటోబయోగ్రఫీ మోడ‌ల్‌ కారును.. ప‌వన్ క‌ళ్యాణ్ పేరు మీద బుక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ కాస్ట్లీ కారు ధ‌ర నాలుగు కోట్లకు పైగానే ఉంటుంద‌ని అంటున్నారు.

కొత్త కారు కొన్న ప‌వ‌న్‌..ఎన్ని కోట్లో తెలుసా?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts